అనసూయ 'పక్కా కమర్షియల్' అంటూ బయటపెట్టిన మారుతి!
on Jun 25, 2022
జబర్దస్త్ షోకి రేటింగ్ పడిపోకుండా అలా నిలబడుతుంది అంటే దానికి కారణం ఇప్పుడు అనసూయ అనే చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి లేటెస్ట్ ప్రోమో ఒకటి రీలీజ్ అయ్యింది. మారుతీ డైరెక్షన్ లో గోపీచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్’ మూవీ జులై 1న విడుదల కాబోతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ని ముమ్మరంగా చేసేస్తోంది ఈ టీమ్. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే మారుతి, గోపీచంద్ జబర్దస్త్ షోకి వచ్చేశారు. అల్లరల్లరి చేసేశారు.
రావడం రావడమే మారుతి యాంకర్ అనసూయ గురుంచి గడగడా కొన్ని నిజాలు చెప్పేశాడు. అనసూయ ఆయన నోరు ముయ్యడానికి ట్రై చేసింది కానీ నిజాలు మాత్రం బయటికి వచ్చేశాయి. "పక్కా కమర్షియల్ యాంకర్ ని చూడడానికి వచ్చాను. ఈవిడ మామూలు కమర్షియల్ కాదు. చిన్న చిన్న పాత్రలు ఇస్తే అస్సలు ఒప్పుకోదు" అనేసరికి అనసూయ ఒక్కసారిగా షాక్ అయ్యింది.
ఇప్పుడు ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనసూయ భరద్వాజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ బ్యూటీగా అను పేరు తెచ్చుకుంది. ఇప్పుడున్న తెలుగు యాంకర్లలోకి ఈమెది స్పెషల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక ఈ న్యూ ప్రోమోలో 'జయం', 'నిజం' మూవీస్ నుంచి సాంగ్స్ ని , కొన్ని సీన్స్ ని చలాకి చంటి పెర్ఫామ్ చేశారు.
బుల్లితెర మీదే కాదు అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెర మీద మెరుస్తోంది అనసూయ. ఎలాంటి ప్రత్యేక పాత్రలో ఐనా సరే చాలా సునాయాసంగా నటించగలదని డైరెక్టర్స్ కూడా ఈమె వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు 'దర్జా' మూవీలో ఒక లీడ్ రోల్ చేసింది అనసూయ. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఇంకా కృష్ణవంశీ డైరెక్షన్లో వస్తున్న 'రంగమార్తాండ' మూవీ కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.